ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎ.ఆర్. సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ. హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. పెళ్లి చూపుల్లో ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) ని ఈశా రెబ్బా ‘మీరు లాస్ట్ చూసిన సినిమా ఏది? అంటూ అడిగే ప్రశ్నతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం అలరించింది. ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ అదరగొట్టేశారు. ‘కలకత్తాలలో చేపలని జలపుష్పాలు అంటారు. మీ పుష్పాలు నా చెవిలో పెట్టకండి’ అంటూ గోదారి యాసలో తరుణ్ పలికిన డైలాగులు, తన బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా వున్నాయి. తరుణ్ భాస్కర్ – ఈశా రెబ్బా మధ్య కెమిస్ట్రీ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్, ముఖ్యంగా ట్రైలర్ చివర్లో తరుణ్ భాస్కర్ రియాక్షన్ క్యురియాసిటీని పెంచుతోంది. కీలక పాత్రలో బ్రహ్మాజీ తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నారు.











