• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, July 28, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Cinema News

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

parveen by parveen
2026-04-15
in Cinema News
Reading Time: 1 min read
0 0
A A
‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమకథగా నిలిచింది. డైరెక్ట‌ర్ మోహిత్ సూరి, నిర్మాత క్ష‌య్ విధాని(య‌శ్ రాజ్ ఫిల్మ్స్ సి.ఇ.ఒ), అలాగే జెన్ Z స్టార్స్ అహ‌న్ పాండే, అనీత్ ప‌ద్దా క‌ల‌యిక‌లో మ‌రోసారి ఇంటెన్స్ ల‌వ్ స్టోరీతో మ‌న ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను నిర్ణ‌యించ‌లేదు. హృద‌యాన్ని హ‌త్తుకునే క‌థ‌నం, మ‌ర‌చిపోలేని మెలోడీల‌తో ఈ సినిమా ఓ ప్ర‌త్యేక‌మైన సినీ అనుభ‌వాన్ని త‌ప్ప‌కుండా అందిస్తుంద‌నే హామీ ఇస్తోంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన సైయారా విడుద‌లైన త‌ర్వాత ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది.రీసెంట్ టైమ్‌లో అత్యంత ప్రభావవంతమైన మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. ఇండియాలో సుమారు రూ.338 కోట్ల నెట్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.580 కోట్ల గ్రాస్ వసూళ్ల‌ను సినిమా సాధించింది. పూర్తిగా కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం ఒక రొమాంటిక్ మ్యూజికల్‌గా అసాధారణమైన విజయాన్ని అందుకుంది. సినిమాలో హృద‌యాల‌ను హ‌త్తుకునే పాట‌లను ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. స్ట్రీమింగ్ చార్ట్స్‌లో ఈ సాంగ్స్ టాప్‌లో నిలిచాయి. దీంతో ఈ సినిమా భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా నేటి యువతలో, ఒక పాప్ కల్చర్ ఫెనామెనాన్‌గా తన ప్రభావాన్ని బ‌లంగా చూపింది.

అహ‌న్ పాండే, అనీత్ ప‌ద్దా జంట‌గా న‌టించిన సైయారా జెన్ జీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. దీంతో వీరిని అభిమానులు ప్రేమగా “Ahneet” అని పిలిచారు.సైయారాలో వారి మ‌ధ్య క‌నిపించిన చ‌క్క‌టి కెమిస్ట్రీ, సహజమైన నటన, ఎనర్జీ ప్రేక్షకులకు ఎంతో గుర్తుండిపోయే అనుభవాన్ని ఇచ్చింది. ఇప్పుడు మ‌రోసారి కొత్త చిత్రంతో వారు మళ్లీ రాబోతుండటంతో, అదే చార్మ్, నటన, స్క్రీన్‌పై మళ్లీ క‌నిపించ‌బోయే కెమిస్ట్రీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సంద‌ర్భంగా మోహిత్ సూరి మాట్లాడుతూ ‘‘నేను ప్రేమకథలకు ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తాను. భావోద్వేగాలు అతి తీవ్రంగా, నియంత్రణలో లేని స్థితిలో ఉండి, వ్యక్తిని పూర్తిగా ఆక్రమించేసేలా ఉంటే నాకు అవి మరింత ప్రభావవంతంగా అనిపిస్తాయి. ప్రేమను గాఢ‌మైన భావ‌న‌గా నేను భావిస్తాను, అందుకే కథకుడిగా నేను సహజంగానే ఈ జోన‌ర్‌ను ఇష్ట‌ప‌డ‌తాను. మేం చేయ‌బోతోన్న కొత్త సినిమా అలాంటి భావాన్ని అందిస్తుంది. సైయారాలో పనిచేసిన అదే టీమ్‌తో మళ్లీ రావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. దీన్ని గ‌మ‌నిస్తుంటే ఈ క‌ల‌యిక‌ను మ‌రోసారి విధి రాసిందేమోన‌నిపిస్తోంది. మా కల‌యిక‌ను చూస్తుంటే… ఇంటికి తిరిగి వచ్చినట్లే అనిపిస్తోంది… కానీ కొత్త సృజనాత్మకతను జోడించి కొత్త‌ద‌నంతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ కథను చేయ‌టం ఉత్సాహంగా ఉన్న‌ప్ప‌టికీ కాస్త టెన్ష‌న్ కూడా ఉంది. నా సినిమాల ద్వారా ఎప్పుడూ ప్రయత్నించినట్లే, ఈసారి కూడా నా సంగీతం మళ్లీ ప్రేక్షకుల హృదయాలను మెప్పించాల‌ని ఆశిస్తున్నాను’’ అన్నారు.

అక్ష‌య్ విధాని మాట్లాడుతూ ‘‘ మోహిత్ సూరితో మా సహకారం ఎప్పుడూ ఒకే క్రియేటివ్ వైబ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల హృదయాలను తాకే కథలు చెప్పాలనేది మా ఆకాంక్ష. మోహిత్‌తో పని చేయడం అంటే కేవలం ఒక సినిమా చేయడం కాదు.. అది ఒక భావాన్ని వెతకడం, ఒక సంగీత క్షణాన్ని పట్టుకోవడం, సినిమా ముగిసిన తర్వాత కూడా మనసులో నిలిచిపోయే అనుభూతిని సృష్టించడం. సైయారా అలాంటి ఒక అనుభవం. దాన్ని మేము ఎప్పటికీ మరిచిపోలేం. ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేస్తున్నప్పుడు, మేము ఇంకా ఎక్కువ నిజాయితీతో, మరింత భావోద్వేగంతో, మరింత లోతైన కథతో రాబోతున్నాం. మళ్లీ మా కలయిక మరింత సున్నితమైన, మరింత నిలిచిపోయే అనుభవాన్ని ఇవ్వాలన్నదే లక్ష్యం. ఈ చిత్రంలో అహన్ పాండే, అనీత్ పద్దా భాగం కావటం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ మెచ్చిన ఈ జెన్ జీ జోడీ మళ్లీ ఒక మోహిత్ సూరి రొమాన్స్ కోసం కలవడం నిజంగా ప్రత్యేకమైన విషయంగానే చెప్పాలి.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అహ‌న్‌, అనీత్ జోడీగా రూపొంద‌నున్న ఈ సినిమా ఈ ఏడాది చివ‌ర‌లో ప్రారంభం కానుంది. 2027లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Continue Reading
Tags: love storysayarayashraj
SendShareTweetShareShare

Related Posts

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!!  డా. రాజశేఖర్‌
Cinema News

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌

2026-04-15
ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
Cinema News

ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’

2026-04-15
ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
Cinema News

ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్

2026-04-15
గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
Cinema News

గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్

2026-04-15
మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి    –ఎం.వెంకయ్య నాయుడు
Cinema News

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి –ఎం.వెంకయ్య నాయుడు

2026-04-15
బ్యూటిపుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్ నభా నటేష్
Cinema News

బ్యూటిపుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్ నభా నటేష్

2026-04-15

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist