శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు వచ్చిన అనూహ్య స్పందన గురించి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి ఆలపించిన ‘వెళ్లేదారిలో’ అనే ఓ పాట బ్యూటిఫుల్ పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్ అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా కీరవాణి గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. ఈ సందర్భంగా చిత్రాన్ని ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా థ్రియేట్రికల్ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ఆర్‌పీ పట్నాయక్ మాట్లాడుతూ ” యంగ్ టీమ్ చేసిన బ్యూటిఫుల్ సినిమా ఇది. ఈ రోజు వేదిక మీద ఇంత మంది మ్యూజిక్ డైరెక్టర్లును చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఈ రోజు రవి, చందులు కీరవాణి లాంటి గొప్ప సంగీత దర్శకుడిని ఒప్పించి పాడించడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా మెచ్యూర్డ్ అండ్ ఇన్‌స్పిరేషన్ స్టోరీతో రాబోతున్న సినిమా ఇది అన్నారు.











