కోమలి ప్రసాద్ తన ‘మండవెట్టి’ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది పవర్ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఆమె సినీ కెరీర్లో ఇదొక ముఖ్యమైన, కొత్త చాప్టర్. ‘మండవెట్టి’ సినిమాను ప్రారంభించటం తమకెంతో గర్వంగా ఉందని చెప్పిన చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన విషయాలను బయటకు చెప్పలేదు. టస్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యానర్‌పై శరణ్ రాజ్ సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న మండవెట్టి మూవీ టీమ్ లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రాధాన్యమున్న ఈ కథకు తెరపై జీవం పోయటానికి శ్రమిస్తున్నారు. ‘మండవెట్టి’తో కోమలి ప్రసాద్ తన సినీ కెరీర్లో కొత్త భాష, కొత్త సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో పాటు మిస్టిసిజం, ఎమోషన్స్ కలయికగా ఓ మహిళ ప్రధానమైన కథతో సినిమా తెరకెక్కుతోంది. మనకు కావాల్సిన దాన్ని కోల్పోవటం కలిగే బాధ, గుర్తింపు, జీవన పోరాటం, వంటి అంశాలను మిళితం చేసి పెర్ఫామన్స్‌కు స్కోప్ ఉన్న కథను రూపొందించారు.











