ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బలవంత్’ (హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు) అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో శివానీ నగరం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.
‘హే బలవంత్’ ఎలాంటి సినిమా?
నాది సుహాస్‌తో రెండో సినిమా.. నా కెరీర్లో మూడోసినిమా.. సుహాస్‌తో ఇంతకు ముందు చేసిన సినిమాలో చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఇంటెన్స్ స్టోరీ.. ఈ సినిమాలో చాలా లైటర్ వెయిన్.. ఎంటర్టైన్మెంట్ పాత్ర. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర నాది. సినిమా మొత్తం ఆడియన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. చివర్లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా అందర్ని అలరిస్తుంది. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు. నాపాత్రలో ఇన్నోసెన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది.
ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్‌ను పూర్తిచేస్తారా?
సినిమా చాలా బాగుంటుంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. సుదర్శన్, సుహాస్, నాపాత్రలు మిమ్ములను బాగా నవ్విస్తుంది. ఇక నరేష్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ హిలేరియస్‌గా ఉంటాయి. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మీకు సర్ఫ్రైజ్ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు.
ఈ సినిమా ఒప్పుకుంటానికి రీజన్ ఏమిటి?
నాకు వచ్చిన కథలో దిబెస్ట్ పిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సినిమాలో కామెడీలో లేదు. సెకండ్ సినిమాలో ఫుల్ కామెడీ, ఈ సినిమాలో కూడా కామెడీ ఉంది. వినగానే కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చింది.
ఈ సినిమాలో బిజినెస్ ఏమిటి? ఆ బిజినెస్‌తో మీకు ఏమైనా సంబంధం ఉంటుందా?
లేదండి.,. అది సినిమాలో నరేష్ గారి ఫ్యామిలి బిజినెస్ అది నాకు సంబంధం లేదు. అది థియేటర్లో చూసి మీరు ఎంజాయ్ చేస్తారు. కడుపుబ్బా నవ్వుకుంటారు
ఈ సినిమా ఎలా ఉండబోతుంది?
ఈ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో కలర్‌ఫుల్ విజువల్స్, మ్యూజిక్ బాగుంటుంది. వెన్నెల కిషోర్. నరేష్ కామెడీ అలరిస్తుంది. ప్రతి పాత్ర మిమ్ములను నవ్విస్తుంది.
మీరు సింగర్ అని విన్నాం?
కూచిపూడి, సంగీతం నేర్చుకున్నాఉ. సింగర్ టర్నింగ్ యాక్టర్‌ని. లిటిల్ హార్డ్స్లో చిన్న హమ్మింగ్ ఉంటుంది. ఆరంభం సినిమాలో ఓ పాట పాడాను. సింగింగ్ కూడా ఓపెన్‌గా ఉన్నాను. అవకాశాలు వస్తే పాడతాను.
సుహాస్‌తో రెండో సినిమాలో చేయడం ఎలా అనిపించింది?
నాకు చాలా ఫ్రెండ్లీ.. నాకు సపోర్ట్, చాలా మంచి నటుడు. ఈ సినిమాలో మా కాంబినేషన్ అలరిస్తుంది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.
సినిమాల్లోకి వెళుతున్నా అన్నప్పుడు మీ ఇంట్లో ఒప్పుకున్నారా?
మా ఇంట్లో వెరీ సపోర్టింగ్.. వాళ్లు ఇచ్చిన అవకాశాన్ని మంచి సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాను. వాళ్లు కూడా ఎంతొ హ్యపీగా ఉన్నారు.











