“మా ఊరి ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన మంజునాథ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి పేరు, గుర్తింపు తెచ్చు కోవాలని .. వరుసగా సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ‘రౌడీ విక్రమ్’, ‘పక్కా ప్రేమికుడు’, చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే మరొక చిత్రానికి శ్రీకారం చుట్టారు.. హీరో మంజునాథ్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై నూతన దర్శకుడు అభిరామ్ గంటా దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ మంజునాథ్ హీరోగా వి. లక్ష్మీ దేవి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ వన్ చిత్రం ఫిబ్రవరి 19న హైదరాబాద్ సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో మంజునాథ్ క్లాప్ నివ్వగా డీవోపీ శేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి చిత్ర దర్శకుడు అభిరామ్ గంటా గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం … హీరో మంజునాథ్ మాట్లాడుతూ.. ” నేను హీరోగా నటించిన ‘మా ఊరి ప్రేమకథ’ చిత్రం మంచి హిట్ అయి హీరోగా నాకు మంచి పేరు తెచ్చింది. వెంటనే “రౌడీ విక్రమ్” సినిమా అవకాశం వచ్చింది. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో వుంది. ఇదిలా ఉండగా మరొక చిత్రం “పక్కా ప్రేమికుడు” సినిమా లో కూడా హీరోగా చేస్తున్నాను. ఈ చిత్రం తొంబై శాతం కంప్లీట్ అయింది. ఈ రెండు చిత్రాలు అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే మరొక సినిమా చేసే అవకాశం వచ్చింది. అభిరాం గంటా చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో నేను ప్యాషన్ డిజైనర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. అవుట్ అండ్ అవుట్ పక్కా ఫ్యామిలీ ఎంటెర్‌టైన్మెంట్ చిత్రం ఇది. ఈ చిత్రంలో హీరోగా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత లక్ష్మీ దేవి గారికి నా థాంక్స్ .. అన్నారు.











