జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమా టీజర్ రేపు రిలీజ్ కాబోతోంది. అయితే టీజర్ చూసి తనకు బాగా నచ్చడంతో ఈ రోజే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – పూర్వజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. “కిల్లర్” మూవీ టీజర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. టీజర్ చాలా బాగుంది. డిఫరెంట్ జానర్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. సై ఫై థ్రిల్లర్ జానర్స్ కలిపి ఈ సినిమాను బాగా రూపొందించారు. కాంబినేషన్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయి. బాగా ఎగ్జిక్యూట్ చేశారు. గ్రాండ్ గా సినిమాను నిర్మించారు. టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నాను. త్వరలోనే “కిల్లర్” సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. పూర్వజ్ నాకు చాలా కాలంగా తెలుసు. అప్పుడప్పుడు కలుస్తుంటాడు. ఈ సినిమాకు సంబంధించిన సీక్వెన్స్ కొన్ని చూపించాడు. చాలా బాగున్నాయి. జ్యోతి గారిని ఎన్నో సీరియల్స్ లో చూశాం. ఇప్పుడు ఈ మూవీలో ఆమె ట్రాన్సఫర్మేషన్ షాకింగ్ గా ఉంది. యాక్షన్ బాగా చేశారు. రియల్ లైఫ్ లో భార్య భర్తలు ఈ రీల్ లైఫ్ లో ఎలా చేశారు అనేది ఆసక్తికరంగా ఉంది. “కిల్లర్” సినిమాకు మీరంతా సపోర్ట్ చేయాలని కోరుతున్నా అన్నారు.











