యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ రోజు, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. గ్లింప్స్ ఒక భయానకమైన సన్నివేశంతో ప్రారంభమైయింది. ఒక దుష్ట శక్తి ప్రభావంలో ఉన్న వ్యక్తి ఒక చిత్రాన్ని గీయడం, ఒక్కసారిగా అతని లోపల నుంచి ఒక భయంకరమైన శక్తి గబ్బిలం రూపంలో బయటకు వచ్చి మరో వ్యక్తి తలలోకి దూసుకెళ్లి అతన్ని చంపేయడం వెన్నులో వణుకుపుట్టించేలా వుంది. ‘అతీంద్రియ శక్తులు మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు, విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది’ అనే వాయిస్ కథపై మరింత ఆసక్తిని పెంచింది. వృషకర్మ దుష్టశక్తిని ఎదుర్కొనేందుకు ముందుకు అడుగు వేస్తూ గ్లింప్స్ పూర్తి కావడం అదిరిపోయింది. ఈ గ్లింప్స్ భారీ స్కేల్, అద్భుతమైన విజువల్స్, గ్రిప్పింగ్ ప్రెజెంటేషన్‌తో ఆకట్టుకుంటోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఒక భారీ సినీమాటిక్ యూనివర్స్‌ను నిర్మించాలనే మేకర్స్ విజన్ స్పష్టంగా కనిపిస్తోంది. నాగ చైతన్య రగ్గడ్, ఇంటెన్స్ అవతార్‌లో తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్లలో కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, రా, ఫియర్స్ లుక్ గ్లింప్స్‌కు ప్రత్యేకంగా నిలుస్తోంది. దుష్ట శక్తులకు ఎదురొడ్డి నిలిచే యోధుడిలా ఆయన పాత్ర కనిపిస్తోంది.











