ఆర్‌ఎక్స్ 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిర్మాత పి కిరణ్ నిర్మిస్తున్న శ్రీనివాస మంగాపురం ఇప్పటికే విడుదలైన టైటిల్ రివీల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్ల ఆసక్తిని రేకెత్తించాయి. ఇటీవల చిత్రబృందం తిరుపతిలో జరిగిన కీలకమైన మూడో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని తదితర ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తవడంతో సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. ప్రస్తుతం చిత్ర నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మేకర్స్ భారీ స్థాయిలో ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.











