కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి అలరించనున్నారు. మార్చి 6న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈక్రమంలో నాడు మీడియాకి ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘‘మృత్యుంజయ్’ ప్రీమియర్ షోకి వచ్చిన వారందరికీ థాంక్స్. థియేటర్లో రెస్పాన్స్ చూశాను. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. రాజమౌళి గారి నుంచి మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయింది. తారక్ గారు ట్రైలర్ రిలీజ్ చేశారు. నాని గారు రాత్రి మూవీని చూసి మెచ్చుకున్నారు. కంటెంట్ మూవీస్ ఎప్పుడు వచ్చినా మీడియా, ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. కంటెంట్ సినిమాకి అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నిర్మాత సందీప్ గుణ్ణం మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ని సపోర్ట్ చేసిన సుకుమార్ గారు, రాజమౌళి గారు, తారక్ గారు, నాని గారు ఇలా అందరికీ థాంక్స్. ఈ మూవీ కోసం మా టీం నిద్రలేని రాత్రులు గడిపి పని చేసింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు. హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ .. ‘నాని గారు ‘మృత్యుంజయ్’ చూశారు. ఆయనకు నచ్చింది అని నాకు తెలిసిన తరువాత నాకెంతో ప్రశాంతంగా అనిపించింది. ఆయన రివ్యూ ఎప్పుడూ తప్పదు. నా ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ఎన్టీఆర్ కి థాంక్స్అని అన్నారు.











