మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ నాగబంధం అద్భుతమైన కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది. అభిషేక్ నామా దర్శకత్వంలో నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో భారతీయ సినిమాలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతోంది. మార్చి 15న ఉదయం 11:11 గంటలకు నాగబంధం ఫస్ట్ సింగిల్ “నమో రే” రిలీజ్ కానుంది. ఈ పాట నారాయణుడికి నివాళిగా ఆధ్యాత్మికత ప్రజెంట్ చేయబోతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న నాగబంధంలో “నమో రే” సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పాటలో ఏకంగా 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొంటూ, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించే అద్భుతమైన విజువల్ స్పెక్టాకిల్‌గా రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారు. “నమో రే” పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్ – అభే జంట అందించగా, భక్తి భావం , ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా డ్రీమీ మ్యూజికల్ ట్రీట్ కంపోజ్ చేశారు. గేయరచయిత శ్రీహర్ష ఇమాని రాసిన సాహిత్యం పాట థీమ్‌కు అద్భుతంగా ప్రజెంట్ చేయబోతుంది. గాయకులు సింధుజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారురి ఈ పాటకు ప్రాణం పోశారు. సాంగ్ పోస్టర్‌లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌లను సాంప్రదాయ వేషధారణలో అద్భుతంగా కనిపించడం పాటలోని గ్రాండియర్‌ను ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించడం ద్వారా విజువల్‌గా మరింత వైభవాన్ని అందించారు. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని సౌందర్ రాజన్ ఎస్ నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్ అశోక్ కుమార్ చేపట్టారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జునైద్ కుమార్ అందిస్తుండగా, ఎడిటింగ్‌ను ఆర్‌సి ప్రణవ్ నిర్వహిస్తున్నారు.










