కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ “యూత్”. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న “యూత్” మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా ప్రెషర్స్ మీట్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో సందడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయి మార్తండ్ మాట్లాడుతూ – “యూత్” సినిమాను మేమే తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఇంతలో వినీత్, సందీప్ తీసుకున్నారు. కెన్ వర్సటైల్ పర్సన్. యాక్టింగ్, రైటింగ్, లిరిక్స్, సింగింగ్..ఇలా అన్నీ తానే టాప్ క్లాస్ లో చేస్తుంటాడు. నాకు మన మౌళిలా అనిపించాడు. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. సింజిత్ సాంగ్ పాడాడు. ఈ మూవీలోని మీనాక్షిని మా లిటిల్ హార్ట్స్ లో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాం. “యూత్” మూవీ చాలా బాగుంటుంది మీరంతా థియేటర్స్ లో చూడాలని కోరుతున్నా. అన్నారు.











