సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. సముద్రఖని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా దర్శక నిర్మాతలకు టీమ్ అందరికీ ధన్యవాదాలు. అభిరామి మేడం గారికి నేను అభిమానిని. వారితో కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. మరెన్నో చిత్రాలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను ఈ సినిమా టైటిల్ కామాఖ్య అని చెప్పగానే మరో ఆలోచన లేకుండా చేసేద్దాం అని చెప్పాను. ఆ పవర్ నాకు తెలుసు. నా కెరీర్ లో ఒక ప్రాజెక్టు విషయంలో చాలా ఆలస్యం అయింది. ఆ సమయంలో అమ్మవారి దర్శనం కోసం వెళ్లాను. అక్కడ ఓ ఋషి నన్ను పేరుతో పిలిచి మాట్లాడారు. ఆ సందర్భంలో నా ప్రాజెక్ట్స్ సంగతి చెప్పాను. దర్శనం చేసుకొని వెళ్ళు అయిపోతుంది అన్నారు. తమిళనాడు ల్యాండ్ అయిన వెంటనే హీరోతో మీటింగ్ అనే మెసేజ్ వచ్చింది. అది అమ్మవారి పవర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి వెళ్లి అన్నదానం చేసి వచ్చాను. సరిగ్గా ఆరు నెలలకి అభి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. చేసేద్దాం అన్నాను. ఇది ఎక్స్ ట్రార్డినరీ మూవీ. అమ్మవారి అనుగ్రహం అందరిపై వుండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.











