చార్మింగ్ స్టార్ శర్వా, భిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, ఎపిక్, 4డిఎక్స్, పిసిఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ప్స్‌లు, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ను సృష్టించాయు. ఈ రోజు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇండియన్ రేసర్లు ప్రపంచ స్థాయి ప్రతిభావంతులతో సమానంగా నిలబడగలరా అని ఒక ఫారిన్ స్పోర్ట్స్ యాంకర్ ప్రశ్నించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో శర్వా మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం. మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు.. సీనియర్స్ తర్వాతే మేము. సీనియర్స్ ముందు నడుస్తుంటారు. వారి వెనక మేము నడుస్తాం. రాజశేఖర్ గారు ఈ సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. దిల్ రాజు గారు చెప్పినట్లు నిర్మాతలు దగ్గరుండి కథలు రాయించి సినిమాలు చేస్తే ఖచ్చితంగా మంచి విజయవంతమైన చిత్రాలు వస్తాయి. నాకు బాగా గుర్తు శతమానం భవతి సినిమా సమయంలో దిల్ రాజు గారు దగ్గరుండి పాటలు రాయించుకునేవారు. అలాంటి డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ పరిశ్రమకు కావాలి. వంశి అన్న కూడా తనకు కావలసిన సాంగ్స్ నీ దగ్గరుండి రాయించుకుంటారు. బైకర్ సినిమా గురించి ఒకటే మాట చెప్తాను.. మొన్న చెప్పి హిట్టు కొట్టాను.(నారీనారీ నడుమమురారి) ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను. ఈసారి బైకర్ తో బంపర్ బ్లాక్ బాస్టర్ కొడుతున్నాను. ఇండియా మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా తీశాం. ఏప్రిల్ 3న థియేటర్లో కలుద్దాం. సినిమా గురించి ఇంకా మాట్లాడుకుందాం. అందరికీ థాంక్యు అని అన్నారు.











