భారతదేశంలో విభిన్న భాషల్లో లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలని రూపొందించడంలో పేరుగాంచిన మోస్ట్ డైనమిక్ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ తమ మూడవ తమిళ చిత్రం #మైత్రి తమిళ్03ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ టాలెంటెడ్ సూరి హీరోగా నటిస్తుండగా, దర్శకుడు ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇన్‌టెన్స్‌గా, విజువల్‌గా ఆకట్టుకుంది. పోస్టర్‌లో హీరో వెనుక నుంచి కనిపిస్తూ, మురికిగా ఉన్న వరద నీటిలో నడుము వరకు నిలబడి ఉంటాడు. అతని ప్రతిబింబం నీటిలో కనిపిస్తూ ఒక స్యూరియల్ ఫీల్ ఇస్తోంది. కుడిచేతిలో ఆయుధం పట్టుకుని ఉండటం ప్రమాదం, బతుకుబాట మధ్య పోరాటాన్ని సూచిస్తోంది. చుట్టూ పగిలిపోయిన సామాన్లు, చెదరిపోయిన వస్తువులు, తలకిందులైన గ్యాస్ సిలిండర్.. ఇవన్నీ విపత్తు తర్వాతి పరిస్థితిని చూపిస్తున్నాయి. ముందున్న తలుపు నుంచి వచ్చే ఎర్రటి వెలుతురు ఒక ఇంటెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తోంది. నీటిలో కనిపించే ప్రతిబింబం పైన “BLOOD FOLLOWED THE FLOOD” అనే వాక్యం ఉండటం కథలో హింస, భావోద్వేగాలను సూచిస్తోంది. పోస్టర్ మిస్టీరియస్‌గా, టెన్షన్‌తో నిండి ఉండటంతో సినిమా పై ఆసక్తి పెంచుతోంది. ఇటీవల ‘కొట్టుక్కాళి’, ‘విదుదలై’, ‘మామన్నన్’ వంటి సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న సూరి, ఈ చిత్రంతో మరొక బలమైన పాత్రలో కనిపించనున్నారు.










