హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్ (SITSA) కర్టెన్ రైజర్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సీరియల్ ప్రముఖులు, యాక్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు. టెలివిజన్ సీరియల్ పరిశ్రమను గౌరవించడమే లక్ష్యంగా మొదలైన SITSA అవార్డ్స్, దక్షిణ భారతదేశంలో నాలుగు భాషల సీరియల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించనుంది. ఇంతవరకు ప్రతి ఛానల్ తన సొంత అవార్డులు విడివిడిగా నిర్వహించేది. ఇప్పుడు నాలుగు భాషలు, నాలుగు రాష్ట్రాలను ఒకేసారి గౌరవించడం ఇండస్ట్రీలో మైలురాయిగా కాబోతుంది. కర్టెన్ రైజర్ ఈవెంట్లో నామినేషన్లు, ఓటింగ్ విధానం, ఎక్స్పెక్టెడ్ నామినీలు, సీరియల్ ఆర్టిస్టుల పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు మధు గారికి, రాఘవి మీడియా టీమ్‌కి అందరూ ధన్యవాదాలు తెలిపారు. టెలివిజన్ పరిశ్రమ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి అవార్డ్ ఫంక్షన్ ఇదే మొదటిసారి. ఈవెంట్లో మాట్లాడిన ప్రముఖులు.. టీవీ కళాకారులు, టెక్నీషియన్లు గత 50 ఏళ్లుగా ప్రతి ఇంట్లోకి వెళ్తున్నా, వారికి గుర్తింపు ఇవ్వడంలో జరిగిన లోపాలను గుర్తు చేశారు. ప్రభుత్వాలు, సంస్థలు ముందుకు రాకపోవడం వలన చిన్న చిన్న సంస్థలే అవార్డులు ఇచ్చేవి. ఇప్పుడు రాఘవి మీడియా ద్వారా సౌత్ ఇండియా మొత్తం టీవీ పరిశ్రమకు గౌరవం లభించడం గర్వకారణమని అందరూ అభిప్రాయపడ్డారు.











