ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం (ఈ నెల 27న) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ – సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది అన్నారు.











