తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి హేమ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. తనపై నమోదైన డ్రగ్స్ కేసు, దాని వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై భావోద్వేగంగా ఇటీవలె స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లాయని ఆమె ఆరోపించారు. మళ్లీ యూరిన్ టెస్ట్ లో కూడా నెగిటివ్ వచ్చిందని ఆమె ఎక్స్ వేదికగా తెలిపారు. హేమ ఎప్పుడు తప్పు చేయదు జెన్యూన్ గా ఉంటుంది.. ముక్కు సూటిగా మాట్లాడుతుంది అని ఆమె తెలిపారు.











