అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని, లక్ష్మీ ప్రియా జంటగా నటించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3న ద్విభాషా చిత్రంగా విడుదలై కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.
కథ ఎలా ఉందంటే…
సమాజంలో డబ్బుకు ఉండే ప్రాధాన్యత కుటుంబ బంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ చిత్రం ద్వారా సున్నితంగా తెలిపాడు దర్శకుడు. ఎక్కడా బోర్ అనిపించకుండా, భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది. సెల్వం అనే కార్ డ్రైవర్ పాత్రలో సముద్రఖని నటించారు. ఆయన భార్యగా లక్ష్మీప్రియా కనిపించారు. సంపత్, దేవి (గౌతమ్ మీనన్, అభినయ) దంపతుల దగ్గర సెల్వం కార్ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. ఆయన భార్య లక్ష్మీ ఇడ్లీ బండి నడుపుతూ.. కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉండాలనుకుంటుంది. సొంత ఇల్లు, కారు కొనుక్కోవాలనే కలతో వీరిపయనం సాగిస్తూ ఒక్కో రూపాయి సేవ్ చేసుకుంటుంటారు. వచ్చే కుటుంబ ఖర్చులు కావచ్చు మరేదైనా అవసరం కావచ్చు మిడిల్ క్లాస్ జీవితాల ప్రభావం చూపిస్తూ…అప్పులు చేస్తూ గొప్పలకు పోయి లేనిపోని ఖర్చులు పెడుతూ కుటుంబ భారాన్ని ఏ విధంగా మోసాడో చూపారు.
ఎలా ఉందంటే :
ఎమోషన్స్, కుటుంబ బంధాలు బాంధవ్యాలతో సాగే చక్కటి కుటుంబకథా చిత్రమిది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి వల్గారిటీ లేకుండా, మద్యపానం, ధూమపానంతో పాటు ఒక్క బూతుపదం కూడా లేకుండా ఇటీవల కాలంలో వచ్చిన సినిమా ఇది. మధ్యతరగతి కుటుంబ విలువలను చాటిచెప్పేలా సాగుతూ, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్లను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందనేది చాలా రియలిస్టిక్‌గా చూపించిన విధానం ఆకట్టుకుంది.
ఎవరెలా చేశారంటే :
సముద్రఖని బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సహజమైన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన పాత్రలో ఉన్న లోతు, భావోద్వేగాలు ఎంతో సహజంగా కనిపిస్తాయి. సెల్వం పాత్రలో సముద్రఖని నటించిన తీరు ప్రతి ఒక్కరినీ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. మధ్యతరగతి భర్తగా, మధ్యతరగతి తండ్రిగా తనదైన ఎమోషన్స్‌ను పండించారు. ఆయన భార్యగా లక్ష్మీ ప్రియా నటన ప్రతి మహిళకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు రామ్ చక్రి ఈ కథను చాలా సహజంగా, రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ దక్షణ్ అందించిన విజువల్స్ ప్లెజెంట్‌గా ఉన్నాయి.
రేటింగ్: ⭐⭐⭐⭐☆ (4/5)











