‘శంబాల’ చిత్రంతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న హీరో ఆది సాయి కుమార్, ఇప్పుడు స్ట్రాంగ్ కమర్షియల్, కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల వైపు దృష్టి పెడుతున్నారు. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఆయన ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ‘కె-ర్యాంప్’ సంచలన విజయంతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ సరసన బంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తున్నారు. ‘సైరాబాను’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, ఆకట్టుకునే పోస్టర్ ద్వారా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ డిజైన్ ఉత్సాహభరితమైన రొమాంటిక్ వాతావరణాన్ని ప్రజెంట్ చేస్తోంది. సాఫ్ట్ పాస్టెల్ రంగులతో అద్దిన ఒక హార్ట్ షేప్ గులాబీ మేఘం, పోస్టర్ పైభాగంలో తేలుతున్నట్లుగా ఉంది. దాని కింద “ “A Fun Filled Journey of Love, Faith & Destiny.”” అనే ట్యాగ్‌లైన్ ఆకట్టుకుంది. పోస్టర్ లో నీటితో తడిసిన చార్మినార్, ప్రశాంతమైన వైజాగ్ బీచ్ రోడ్, రాజమండ్రి గోదావరి వంతెన, ఇవన్నీ బ్యాక్ డ్రాప్ లో వుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. నిర్మలమైన, ప్రశాంతమైన ఆకాశం, చెల్లాచెదురుగా ఉన్న మేఘాలు ఈ విజువల్‌కు మరింత అందాన్ని జోడించాయి.










