• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Cinema News

‘బైకర్’ కు బంపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్- చార్మింగ్ స్టార్ శర్వా

parveen by parveen
2026-04-03
in Cinema News
Reading Time: 1 min read
0 0
A A
‘బైకర్’ కు బంపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్- చార్మింగ్ స్టార్ శర్వా

చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బంపర్ బ్లాక్ బస్టర్ మీట్ ని నిర్వహించారు.

చార్మింగ్ స్టార్ శర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా ప్రభాస్ అన్నకి థాంక్స్ చెప్పాలి. మా ట్రైలర్ రిలీజ్ కి ట్వీట్ వేశారు. అలాగే సినిమా రిలీజ్‌కు ముందు ఒక చిన్న యాడ్ చేసి సపోర్ట్ ఇచ్చారు. లవ్ యూ ప్రభాస్ అన్న. నా మనసులో ఆయన ఎప్పుడూ గొప్ప స్థానంలో ఉంటారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో మా ప్రొడ్యూసర్ వంశీ అన్న. ఈ కథను మొదట నాకు పంపించింది ఆయనే. యూవీ క్రియేషన్స్‌లో ఇది నాకు నాలుగో హిట్. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు, ఇప్పుడు బైకర్. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని చెప్పాను.. ఇచ్చాను. ఇప్పుడు సమ్మర్‌కు బంపర్ బ్లాక్‌బస్టర్ ఇచ్చాం. ఈ విజయాన్ని నాకు అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలు చేయాలంటే ప్రొడ్యూసర్‌కు అభిరుచి ఉండాలి. ఈ సినిమాను అద్భుతంగా నిర్మించిన వంశీ అన్నకి థాంక్యూ. మా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారు చెప్పిన కథ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. నేను ఇలా ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడానికి, వెయిట్ తగ్గుడానికి కారణం నన్ను ఇన్‌స్పైర్ చేసిన కథ. ఈ క్యారెక్టర్ కోసం దాదాపు 22 కిలోలు తగ్గాను. “బైకర్” ద్వారా నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇండియా గర్వించే సినిమా తీస్తామని చెప్పాం..తీసాం. ఇప్పుడు ఆడియన్స్‌కు చూపిస్తున్నాం. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఇది నా బెస్ట్ ఫిల్మ్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. రేసింగ్ సీక్వెన్స్‌లు అద్భుతంగా రావడానికి కారణం యాక్షన్ మాస్టర్ దిలీప్. అలాంటి సీన్స్ చేయాలంటే విజన్, అనుభవం చాలా అవసరం. మా డీఓపీ యువరాజ్, మధి గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ ఇంకా నా చెవుల్లో మార్మోగుతోంది. మాళవిక స్క్రీన్ ప్రెజెన్స్ చాలా చక్కగా ఉంది. ఎడిటర్ అనిల్ సినిమా అద్భుతంగా ఎడిట్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి థాంక్యూ. సంపత్ గారితో “భోగి” సినిమా చేస్తున్నాను .. దానికి కూడా నేను చాలా కష్టపడాలి. షూటింగ్ సమయంలో నేను, మాళవిక ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం కాదు. ఏదైనా ఉంటే డైరెక్టర్ ద్వారానే చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు ప్రమోషన్స్‌లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మాళవిక బెస్ట్ పెర్ఫార్మర్. రాజశేఖర్ గారి దగ్గర నుంచి హంబుల్‌నెస్ నేర్చుకోవాలి. ఆయనంత సింపుల్, ప్యూర్ హార్టెడ్ వ్యక్తిని నేను చూడలేదు. ఆయన లెజెండరీ యాక్టర్. ఆయన మా సినిమాలో భాగమవడం గర్వంగా ఉంది. స్క్రీన్ మీద నిజంగా తండ్రి-కొడుకుల్లా అనిపించింది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. “బైకర్”ని యూత్‌ చూస్తున్నారు.ఇందులో స్పోర్ట్స్ డ్రామాతో పాటు తండ్రి-కొడుకుల ఎమోషన్ ఉంది. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను ఎప్పుడూ బిలీవ్ చేస్తారు. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇది చాలా జెన్యూన్ ఫిల్మ్. మీరు చూస్తే మంచి సినిమా చేశానని అభినందిస్టారు. ఇంత పెద్ద బంపర్ బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

సీనియర్ హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడం, మంచి పేరు తెచ్చుకోవడానికి ఒక ముఖ్య కారణం డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారు. ఆయన ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆయన విజన్‌కు తగ్గట్టు ఖర్చు పెట్టిన నిర్మాత వంశీ గారికి హ్యాట్సాఫ్. ఈ సినిమాలో రేసింగ్‌తో పాటు అందమైన ఫ్యామిలీ మూమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద నన్ను “తాతయ్య” అని పిలిపించే క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం డైరెక్టర్ అభిలాష్ గారే. అలాగే శర్వా గారు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసిన అన్ని టెక్నీషియన్స్‌కి, నటీనటులకు నా ధన్యవాదాలు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బైకర్ సినిమాతో నేను డే వన్ నుంచే ట్రావెల్ అవుతున్నాను. ఈ టీమ్ మొత్తం పడిన ప్రతి కష్టం నేను దగ్గరగా చూసాను. ఆ జర్నీ మొత్తం తెలిసిన నేనే ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుంచి కళ్లను తిప్పుకోలేకపోయాను. అంతగా ఈ సినిమా నన్ను కనెక్ట్ చేసింది. ఈ సినిమాలో ఎంతో మంచి ఎమోషన్ ఉంది. మన జీవితంలో మనకి చాలా మందిపై ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమను బయటకు చెప్పకుండా, చిన్న చిన్న మనస్పర్థల వల్ల వాళ్లతో దూరం అవుతుంటాం. మనకు ఎంతో ముఖ్యమైన వాళ్లను మనమే దూరం పెట్టుకుంటాం. నిజానికి అలా చేయకూడదు. మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే జీవితం చాలా హాయిగా, ఆనందంగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు కూడా అదే ఫీల్ వచ్చింది. ఏదైనా సరే, మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి, ఎవరినీ దూరం పెట్టకూడదు. అందరూ సంతోషంగా ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమాను థియేటర్లలో చూడండి. ఆడియన్స్ రివ్యూ మాకు కావాలి.

సంపత్ నంది మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. “బైకర్” ప్రీమియర్స్‌ చూసినప్పటి నుంచి బైక్ సౌండ్ ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. అంత గొప్పగా ఈ సినిమాకు సౌండ్ మిక్సింగ్ చేశారు. ఆ సౌండ్ రీసౌండ్ రూపంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శర్వా గారు ఈ సినిమా కోసం ప్రతిరోజూ దాదాపు 30 కిలోమీటర్లు నడవడం నేను ప్రత్యక్షంగా చూశాను. అంత డెడికేషన్‌తో ఈ సినిమా చేశారు. నేను ఆయన అన్ని సినిమాలు చూశాను; “బైకర్” ఆయన కెరీర్‌లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇకనుంచి శర్వా గారి కొత్త యాంగిల్ చూడబోతున్నారు. మొన్న “నారి నారి”, ఇప్పుడు “బైకర్”, నెక్స్ట్ “భోగి” — ఇలా శర్వానామ సంవత్సరం చూడబోతున్నారు. శర్వా గారు, రాజశేఖర్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. రాజశేఖర్ గారితో పని చేసే అదృష్టం నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి విజన్ ని నమ్మి ఈ సినిమాను అద్భుతంగా నిర్మించిన యూవీ క్రియేషన్స్‌కు అభినందనలు. మొత్తం టీమ్‌కు కంగ్రాచ్యులేషన్స్.

హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ మూమెంట్ చాలా ఎమోషనల్‌గా ఉంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఇది రెండేళ్ల కష్టం. శర్వా గారు ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమించారు. రాజశేఖర్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. “బైకర్” లాంటి కథను అభిలాష్ లాంటి దర్శకుడు మాత్రమే తీయగలరు. మా టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను రూపొందించారు. సినిమాను ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్యూ సో మచ్.

డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ సినిమా ప్రీమియర్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తర్వాత అది మరింత పెరిగింది. ఎమోషన్, రేసింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మొదటినుంచి ఈ సినిమాలో రేసింగ్‌తో పాటు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందని చెప్పాను. ఈరోజు ఆడియన్స్ అదే ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. క్లైమాక్స్ సీన్స్ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు కూడా రేసింగ్ సీన్స్ చూసి టెన్షన్ పడుతున్నారు అంటే, ఒక దర్శకుడిగా నేను అనుకున్నది సాధించానని భావిస్తున్నాను. చివరి 40 నిమిషాలు అద్భుతంగా వుందని అంటున్నారు.. అదే మేము సెట్ చేసిన డ్రామా. శర్వా అన్న నా విజన్‌ను నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. ఈ క్యారెక్టర్ కోసం వెయిట్ తగ్గాలని చెప్పగానే ఐదు నెలలు హార్డ్ వర్క్ చేసి అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో రావడానికి ప్రధాన కారణం శర్వానంద్ గారే. ఈ కథ చెప్పగానే రాజశేఖర్ గారు వెంటనే ఓకే చెప్పడం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. ఆయన సపోర్ట్ మర్చిపోలేను. శర్వా గారు, రాజశేఖర్ గారి కెమిస్ట్రీ అద్భుతంగా వచ్చింది. మాళవిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. మా టీమ్ మొత్తం సూపర్‌గా వర్క్ చేసింది. ఈ సినిమాకు అద్భుతమైన సౌండ్ క్వాలిటీ రావడానికి కారణం జిబ్రాన్ మ్యూజిక్. అందరూ థియేటర్స్‌కు వచ్చి సినిమా చూడండి. ఇది చిన్నా, పెద్దా అందరికీ నచ్చే సినిమా. ఇలాంటి సినిమాలు తీయాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. మా నిర్మాతలు ప్రతి విషయంలో నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు. రేపటి నుంచి మా సినిమా ఇంకా గట్టిగా మాట్లాడుతుంది.

నిరూప్ నందకుమార్ మాట్లాడుతూ: ఈ సినిమాలో నేను చేసిన అన్వర్ క్యారెక్టర్‌కు వస్తున్న రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రేక్షకుల ప్రశంసల కోసమే మేము సినిమాలు చేస్తుంటాం. శర్వా గారు, యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద సంస్థల ద్వారా తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.

డీవోపీ యువరాజ్ మాట్లాడుతూ.. సినిమా చూసిన అందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. మ్యూజిక్, కెమెరా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డైరెక్టర్ అభిలాష్ ఈ సినిమా ఐడియా దగ్గర నుంచి ప్రతిదీ తనకు ఏం కావాలో క్లియర్‌గా చెప్పేవారు. శర్వా గారితో ఇది నాకు మూడో సినిమా. ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఆయన ప్రతి సినిమాతో సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. రాజశేఖర్ గారితో వర్క్ చేయడం కూడా చాలా ఆనందంగా అనిపించింది. సినిమాను ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్యూ సో మచ్.

ఎడిటర్ అనిల్ మాట్లాడుతూ.. “రన్ రాజా రన్” సినిమా సమయంలో నేను చదువుతున్న కాలేజీకి శర్వానంద్ గారు గెస్ట్‌గా వచ్చారు. ఈరోజు అదే బ్యానర్‌లో ఆయన హీరోగా చేసిన సినిమాకు నేను ఎడిటర్ కావడం అద్భుతంగా అనిపిస్తోంది. ఈ మూమెంట్‌ను నేను చాలా సక్సెస్‌లాగా ఫీల్ అవుతున్నాను. ఎఫ్ 1 చూసి “ఇండియాలో ఇలాంటి సినిమా తీగలమా” అనే కామెంట్స్ వినిపించాయి. ఆ సినిమా వచ్చేటప్పటికి మా సినిమా పూర్తి అయిపోయింది. అప్పుడే మాకు చాలా నమ్మకం వచ్చింది. శర్వా గారి పర్ఫార్మెన్స్ అవుట్‌స్టాండింగ్‌గా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అభిలాష్‌కి, ప్రొడ్యూసర్స్‌కి, శర్వా గారికి కృతజ్ఞతలు.

Tags: biker sampathnandimalavika
SendShareTweetShareShare

Related Posts

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!!  డా. రాజశేఖర్‌
Cinema News

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌

2026-04-15
ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
Cinema News

ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’

2026-04-15
ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
Cinema News

ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్

2026-04-15
గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
Cinema News

గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్

2026-04-15
‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..
Cinema News

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

2026-04-15
మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి    –ఎం.వెంకయ్య నాయుడు
Cinema News

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి –ఎం.వెంకయ్య నాయుడు

2026-04-15

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist