బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
డెకాయిట్ తెలుగు ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. హిందీ రెస్పాన్స్ ఎలా ఉంది?
హిందీలో చాలా అద్భుతంగా ఉంది. హిందీలో మేము ఊహించిన దాని కంటే చాలా చక్కని రీచ్ ఉంది. ఫస్ట్ టైం భోజ్ పురి లో కూడా ప్రీమియర్ చేస్తారా అని అడిగారు. అది విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. పవన్ సింగ్ గారు ఇందులో చేయడం భోజ్ పురికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మీ గత సినిమాల్లో కూడా ప్రేమ కథలు ఉన్నాయి కానీ.. ఈ ప్రేమ కథకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?
నా గత సినిమాల్లో ఒక బిగ్ ప్లాట్ఫామ్ చేరుకోవడానికి లవ్ స్టోరీ వుంటుంది. కథలో ఒక చిన్న భాగంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో లవ్ స్టోరీ నే మెయిన్ ప్లాట్ ఫామ్.ఈ మొత్తం సినిమాకి లవ్ స్టోరీయే కారణం. ఒక లవ్ స్టోరీ లో యాక్షన్ చూడ్డానికి వెళ్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక యాక్షన్ సినిమాలో లవ్ చూడడానికి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇందులో ఎమోషన్స్ అన్నీ కూడా ఆర్గానిక్ గా ఉంటాయి.
ఈ కథకు ఏదైనా స్ఫూర్తి ఉందా?
ఒకరోజు ఒక విజువల్ మెటాఫర్ నా మైండ్ లోకి వచ్చింది. ‘ఒక బిజీ రోడ్డుపైన ఒక కాంక్రీట్ సిమెంట్ ఫుట్ పాత్ క్రాక్ నుంచి ఒక చిన్న పువ్వు బయటికి వస్తే’…ఈ విజువల్ ఇమాజినేషన్ నుంచి ఈ కథ మొదలైంది. ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో మధ్యలో లవ్ స్టోరీ తయారు చేశాం.
మీరు ఇప్పటివరకు స్క్రీన్ మీద డాన్స్ చేయలేదు. ఈ సినిమాతో మొదలుపెట్టారు దీనికి కారణమేదైనా ఉందా?
చిన్నప్పుడు ఫంక్షన్ లో డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు డాన్స్ చేయొద్దు ఎవరో అన్నారు అప్పటినుంచి ఆ ఫీలింగ్ ఎలా ఉండిపోయింది. నాకు నేనే ఆ లిమిట్ పెట్టుకున్నాను. కానీ ఈ సినిమా కోసం ఆ లిమిటేషన్ దాటాను. ఇందులో హరి క్యారెక్టర్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. తను మొహం మీద మాట్లాడే వ్యక్తి చాలా ఓపెన్ గా ఉండే క్యారెక్టర్. ఈ పాత్ర కోసమే మదనపల్లి యాస ప్రాక్టీస్ చేసి చేసి ఇంట్లో కూడా మాట్లాడటం మొదలు పెట్టాను. నా యాస చూసి మా అమ్మ ‘ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్’ అన్నారు( నవ్వుతూ)
ఈ సినిమా కాస్త డిలే అయింది కదా దీనికి కారణం?
నిజానికి ఒక డిలే కాలేదు. నేను సినిమా చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది. నా వరకు గత రెండు సంవత్సరాలుగా రోజు ఆగకుండా పనిచేస్తున్నాననే ఉంది. కాకపోతే బయటికి అది రెండు సంవత్సరాలు అయింది కదా అనిపిస్తుంది.
వరుసగా సినిమాలు రావాలంటే నేను రైటింగ్ ప్రాసెస్ లో ఉండకూడదు. గూడచారి 2 తర్వాత ఎమోషనల్ గా రీఛార్జ్ అవ్వాలి అనుకుంటున్నా. వేరే వాళ్ళ విజన్ లో వర్క్ చేయాలనుకుంటున్నాను.
డాల్బీ లో రిలీజ్ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది?
మాకు మొదటి నుంచి సినిమాని డాల్బీలో రిలీజ్ చేయాలని ఉంది. కాకపోతే అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి సినిమా చాలా ప్రామిసింగ్ గా ఉంది కొలబరేట్ అవుదాం అని చెప్పారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ప్రొడ్యూసర్ సుప్రియ గారి గురించి?
ఈ సినిమాకి కర్త కర్మ క్రియ సుప్రియ గారు. వంద రోజులు షూటింగ్ అంటే 100 పెళ్లిళ్లు చేయడం లాంటిది. ఎన్నో కంప్లయింట్స్, ఈగోలు వుంటాయి. వీటన్నిటిని ఎంతో ఓపికతో తల్లిదండ్రులు భరిస్తారు. ప్రొడ్యూసర్ కూడా అంతే. సుప్రియ గారు ట్రూలీ జమ్ ప్రొడ్యూసర్.
ఈ సినిమాలో మహేష్ బాబు గారి డైలాగ్ పెట్టడానికి కారణం?
రైటింగ్ ప్రాసెస్ లో చాలా ఫ్లోలో వచ్చింది. ఆ సిచువేషన్ కి యాప్ట్ గా ఉంటుంది.
మృణాల్ ఠాకూర్ గురించి?
తను అద్భుతమైన నటి. తను సీన్ లో ఉన్న ఎమోషన్ ని బయట కూడా ఫీల్ అవుతుంది. తనతో ఒక సీన్ చేసిన తర్వాత పర్ఫామెన్స్ చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. మనం కూడా గేమ్ రైజ్ చేయాలని ఒక కాంపిటీషన్ స్పిరిట్ తో చేశాను.











