ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా డి ఎస్ రెడ్డి సమర్పణలో ఢీ, జోడి ఫేమ్ అక్సఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఆర్ కే దీక్ష”. ఈ చిత్రంలో తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ కే దీక్ష” సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తామని దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్ అక్సాఖాన్ మాట్లాడుతూ – “ఆర్ కే దీక్ష” మూవీలో నటించే అవకాశం కల్పించిన రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్. ఈ మూవీ తర్వాత వీరి కాంబినేషన్ లోనే మహిళా కబడ్డీ మూవీ చేస్తున్నాను. “ఆర్ కే దీక్ష” సినిమాలో నంది నంది అనే సాంగ్ చేశాను.ఈ పాట నంది అవార్డ్స్ నేపథ్యంగా సాగుతుంది. ఈ పాట మీ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. మా చిత్రానికి మీ సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నా అన్నారు.











