- కోలీవుడ్ కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న స్టార్ నటుడు విజయ్ (తలపతి విజయ్) ఇక సినిమాలకు దూరమవుతారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా తన చివరి చిత్రం అని విజయ్ స్వయంగా ప్రకటించారు. కువాలాలంపూర్‌లో జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ వేదికగా అభిమానుల సమక్షంలో ఆయన సినిమా రంగం నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
- “నా సినిమాల కోసం థియేటర్లకు వచ్చిన అభిమానుల కోసంనే ఇకపై నిలబడతాను. ఇప్పటివరకు నాకు అండగా నిలిచిన వారికోసం మరో 30 సంవత్సరాలు సేవ చేయాలనుకుంటున్నాను. అభిమానులను సేవించేందుకే సినిమాలకు వీడ్కోలు చెబుతున్నాను,” అని విజయ్ భావోద్వేగంగా అన్నారు.
- తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కంటతడి పెట్టారు. “ప్రారంభం నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. కానీ అభిమానులే నాకు ధైర్యం ఇచ్చారు. 33 ఏళ్లుగా వారు నన్ను ఆదరిస్తున్నారు. చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశతో పరిశ్రమలోకి వచ్చాను. కానీ మీరు నాకు రాజప్రాసాదం ఇచ్చారు. ఇప్పుడు నన్ను ఇంతగా ప్రేమించిన అభిమానుల కోసం నేనూ నిలబడాలనుకుంటున్నాను,” అంటూ విజయ్ మాటలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి.











