ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. ఆయన బ్యానర్‌లో వచ్చిన చిత్రాలు ఒక ట్రెండ్ సృష్టించాయి. దర్శకునిగా కూడా ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ చిత్రాలు అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం’అగధ’ను సిద్ధం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఆయన ఈ ప్రాజెక్టు మీదనే అహరహం శ్రమిస్తున్నారు.
‘అగధ’ ప్రమోషన్స్ విభిన్నంగా మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు దొంగలు ఎమ్మెస్ రాజు ఆఫీసులో దొంగతనానికి వెళ్లడం, అక్కడున్న సినిమా పోస్టర్స్ ని చూస్తూ ఆ దొంగలు ఆ సినిమా జ్ఞాపకాలను తలుచుకోవడం, చివరగా ఒక పోస్టర్ ని చూసి అక్కడ ఏదో ఉందని భయపడటంతో ఆ వీడియో ఎండ్ అవుతుంది. తీరా అక్కడ ఉన్నది ‘అగధ’ సినిమా పోస్టర్ . ఆ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు.











