‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 13న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ‘బ్యాండ్ మేళం’ టీజర్, ‘తిప్పూ కుంటానవ్’ అనే పాట ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ అంటూ సాగే మెలోడీ పాటను మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం రవితేజ ‘బ్యాండ్ మేళం’ టీంకి బెస్ట్ విషెస్‌ను తెలియజేశారు. ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ అంటూ సాగే ఈ బ్యూటీఫుల్ మెలోడీ పాటకు విజయ్ బుల్గానిన్ ఎంతో క్యాచీ ట్యూన్‌ను అందించారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గీత రచయిత చంద్రబోస్ సాహిత్యం ఎంతో అర్థవంతంగా ఉంది. ఈ పాటను శ్వేతా మోహన్ ఆలపించారు. లిరికల్ వీడియోని చూస్తుంటే.. గిరి, రాజిల స్కూల్, చైల్డ్ మోమరీస్‌కు సంబంధించినట్టుగా కనిపిస్తోంది. హర్ష్ రోషన్, శ్రీదేవి స్కూల్ యూనిఫాంలో కనిపించడం, స్కూల్లో చేసిన అల్లరి పనులు, కంపోజ్ చేసిన స్టెప్పులు, పాటను చిత్రీకరించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసేలా ఉంది. సునీల్ సున్నాపు, ఫాల్గుణి బంగేరా కంపోజ్ చేసిన హుక్ స్టెప్పులు నెట్టింట్లో వైరల్ అయ్యేలా కనిపిస్తున్నాయి.











