చార్మింగ్ స్టార్ శర్వా అడ్రెనలిన్ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బైకర్, భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నియువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
మేకర్స్ ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం డాల్బీ సినిమా, ఎపిక్, 4డిక్స్, సిసిఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో కూడా విడుదల కానుంది. దీంతో ప్రేక్షకులకు మరింత ఇమర్సివ్ థియేట్రికల్ అనుభూతి అందించనుంది.
హార్ట్-పౌండింగ్ రేసింగ్ సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన కథతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో విజువల్స్, సౌండ్ డిజైన్, హై-ఆక్టేన్ యాక్షన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి బైక్ రోర్, ప్రతి ఎమోషనల్ సన్నివేశం థియేటర్‌లో మరింత ప్రభావం చూపేలా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ టీజర్లు సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా బలంగా ఉంది. ఈ చిత్రంలో శర్వానంద్ డేరింగ్ ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీనియర్ హీరో రాజశేఖర్ “బుల్లెట్ సునీల్” అనే ఎక్స్ మోటోక్రాస్ లెజెండ్ పాత్రలో కనిపించనున్నారు.











