• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Sunday, September 13, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Actress Gallery

బాలీవుడ్ హీ మ్యాన్ ‘ధర్మేంద్ర’ కన్నుమూత

Bollywood's He-Man Dharmendra Passes Away: End of an Iconic Era

Taza Cinema by Taza Cinema
2025-11-25
in Actress Gallery, Cinema News
Reading Time: 1 min read
0 0
A A
End of an Era Dharmendra's Legacy Remembered on November 24

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత డిశ్చార్జి అయ్యి ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.అక్టోబర్ 31న ఆస్పత్రికి తీసుకెళ్లిన క్రమంలో ధర్మేంద్ర చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. రొటీన్ చెకప్ కోసమే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లామని… ఆరోగ్యం నిలకడగానే ఉందని ధర్మేంద్ర కుటుంబ సభ్యులు తెలిపారు. ఆందోళన అవసరం లేదని చెప్పారు. అలా చికిత్స పొందుతూ ఆరోగ్య విషమించి సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్, బాలీవుడ్ ‘హీ మ్యాన్’గా పేరొందారు.ధర్మేంద్ర పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్సులో స్థానిక విల్లే పార్లీ శ్మశాన వాటికకు తరలించారు.

ఆయన మరణ వార్త తెలుసుకున్న బాలీవుడ్ సినీ ప్రముఖులు, పొలిటకల్ లీడర్స్ కడసారి చూసేందుకు శ్మశాన వాటికకు తరలివచ్చి నివాళి అర్పించారు. ధర్మేంద్రను గుర్తు చేసుకుంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ దేవోల్. 1935, డిసెంబర్ 8న జన్మించారు. 1954లో ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. 1980లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమమాలినిని రెండో వివాహం చేసుకున్నారు.

ధర్మేంద్ర – ప్రకాష్ కౌర్‌కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర – హేమమాలినిలకు ఇషా డియోల్, ఆహానా డియోల్ సంతానం. 1960లో ‘దిల్ బీ తేహా హమ్ బీ తేరా’తో కెరీర్ ప్రారంభించిన ఆయన… ‘అన్‌పఢ్’, ‘బందినీ’, ‘అనుపమ’, ‘ఆయా సావమ్ జూమ్ కే’, ‘షోలే’, ధర్మ వీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్ వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన చివరి చిత్రం ‘ఇక్కీస్’. ఇలా దాదాపు 300కు పైగా చిత్రాల్లో తన నటనతో మెప్పించిన ధర్మేంద్ర బాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. యాక్షన్ కింగ్, బాలీవుడ్ హీ మ్యాన్‌గా పేరొందారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించి గౌరవించింది.

తొలి సినిమా పారితోషికం 51 రూపాయిులు
సినీ ప్రయాణం పూలపాన్పు కాదు. తొలి సినిమాకు సంతకం చేసే సమయంలో తనకు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ వస్తుందని ధర్మేంద్ర ఎంతో ఆశపడ్డారు. కనీసం 500 రూపాయలైనా ఇస్తారని ఉత్సాహంగా ఎదురుచూశారు. కానీ, నిర్మాత టి.ఎం. బిహారీ, ఆయన సహచరుడు ఠక్కర్ తమ జేబుల్లో ఉన్న డబ్బంతా తీసి కేవలం 51 రూపాయలను ఆయన చేతిలో పెట్టారు. ఈ విషయాన్ని ధర్మేంద్ర స్వయంగా 1977లో ఓ ఉర్దూ మ్యాగజైన్‌లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన మొదట ‘షోలా ఔర్ షబ్నమ్’ సినిమాకు సంతకం చేసినప్పటికీ, ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ ముందుగా విడుదల కావడంతో అదే ఆయన తొలి చిత్రంగా నిలిచింది.ఆ కష్టకాలంలో ఆయనకు అండగా నిలిచింది తొలి చిత్ర దర్శకుడు అర్జున్ హింగోరానీ. చేతిలో ఆ 51 రూపాయలు తప్ప ఏమీ లేని ధర్మేంద్రకు హింగోరానీ తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. అంతేకాదు, భోజనానికి కూడా ఏర్పాట్లు చేశారు.

ఒక రెస్టారెంట్‌కు తీసుకెళ్లి, “ఈ అబ్బాయికి రోజూ రెండు బ్రెడ్ స్లైసులు, వెన్న, ఒక కప్పు టీ ఇవ్వండి. జామ్ మాత్రం వద్దు. అదనంగా తింటే డబ్బులు తీసుకోండి,” అని చెప్పి అప్పు మీద భోజనం పెట్టించారు. ఆ తర్వాత కూడా వీరి బంధం కొనసాగింది. హింగోరానీ తీసిన అనేక చిత్రాలలో, ముఖ్యంగా ‘K’ అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ ఉన్న ‘కహానీ కిస్మత్ కీ’, ‘ఖేల్ కిలాడీ కా’, ‘కాతిలోం కే కాతిల్’ వంటి సినిమాల్లో ధర్మేంద్రనే హీరోగా నటించారు. కొన్ని చిత్రాల్లో ఆయన కుమారుడు సన్నీ డియోల్ కూడా నటించడం విశేషం.’ఫూల్ ఔర్ పత్తర్’ చిత్రంతో స్టార్‌గా ఎదిగిన ధర్మేంద్ర, ‘షోలే’లో పోషించిన వీరూ పాత్రతో చరిత్రలో నిలిచిపోయారు. ‘చుప్కే చుప్కే’తో తన కామెడీ టైమింగ్‌ను నిరూపించుకోగా, ‘యాదోంకీ బారాత్’ వంటి చిత్రాలతో యాక్షన్ హీరోగా స్థిరపడ్డారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తన నటన, నిరాడంబరతతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ధర్మేంద్ర, భౌతికంగా దూరమైనా తన సినిమాల ద్వారా ఎప్పటికీ చిరంజీవిగా నిలిచిపోతారు.

ధర్మేంద్ర జీవించారు
భారత సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసిందని అభివర్ణించారు. ధర్మేంద్ర కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదని, ఆయన నిరాడంబరత, వినయానికి ప్రతీక అని కొనియాడారు. ఈ విచారకరమైన సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సంతాప సందేశాన్ని విడుదల చేశారు. “ధర్మేంద్ర జీ మరణం భారత సినిమాలో ఒక శకం ముగింపు. ఆయన ఒక ఐకానిక్ ఫిల్మ్ పర్సనాలిటీ. ప్రతి పాత్రకు తన అద్భుతమైన నటనతో జీవం పోసి, ఆకట్టుకున్నారు.

ఆయన పోషించిన విభిన్న పాత్రలు అసంఖ్యాక ప్రజల హృదయాలను హత్తుకున్నాయి. ధర్మేంద్ర జీ తన నిరాడంబరత, వినయం, ఆప్యాయతతో కూడా ఎంతగానో గౌరవాభిమానాలు పొందారు. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు ఆయన కుటుంబం, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి” అని ప్రధాని పేర్కొన్నారు.ధర్మేంద్ర తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలతో ప్రేక్షకులను అలరించారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని మోదీ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

Tags: Bollywood He-ManBollywood tributeDharmendra biographyDharmendra deathDharmendra passes awayIndian cinema legendlegendary actor Dharmendra
SendShareTweetShareShare

Related Posts

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!!  డా. రాజశేఖర్‌
Cinema News

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌

2026-04-15
ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
Cinema News

ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’

2026-04-15
ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
Cinema News

ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్

2026-04-15
గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
Cinema News

గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్

2026-04-15
‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..
Cinema News

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

2026-04-15
మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి    –ఎం.వెంకయ్య నాయుడు
Cinema News

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి –ఎం.వెంకయ్య నాయుడు

2026-04-15

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist