చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా,ఎపిక్, 4డిఎక్స్, పిసిఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఇప్పటికే గ్లింప్స్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
బైకర్ ఆడియన్స్‌కు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది?
బైకర్ 100% థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. డాల్బీ విజన్‌లో కూడా షూట్ చేశాం. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా సౌండ్ డిజైన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్‌లో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
ఈ కథ రాయడానికి ఇన్స్పిరేషన్?
బైక్ అనేది అందరికీ ఒక ఎమోషన్. నాకు పర్సనల్‌గా ఆ ఎమోషన్ అంటే చాలా ఇష్టం. ఇందులో రేసింగ్‌తో పాటు చాలా మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. ఫాదర్-సన్ మధ్య ఉండే ఎమోషన్ ఆడియన్స్‌కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది.
షూటింగ్‌లో మీరు ఎదుర్కొన్న చాలెంజెస్ ఏమిటి?
ఈ సినిమాలో రేసింగ్ సీక్వెన్స్‌లను రియల్ రేసర్స్‌తో షూట్ చేశాం. షూట్ చేసినప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఒక షాట్ చేసిన తర్వాత రెండు గంటలు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చేది. కేవలం యాక్షన్‌కే 60 రోజులకు పైగా పట్టింది.
ఈ సినిమా రెండు టైమ్‌లైన్స్‌లో జరుగుతుంది. 90స్‌లో టూ స్ట్రోక్ బైక్స్ ఉండేవి, అవి ఇప్పుడు లేవు. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇందులో రేసింగ్ ఇండోనేషియాలో షూట్ చేశాం. ఆ బైక్స్ అన్నీ మళ్లీ ఇండియాకు తీసుకురావడం కూడా చాలా పెద్ద ప్రాసెస్. అలాగే ఈ సినిమా కోసం న్యూజీలాండ్, ఆస్త్రేలియా నుంచి రేసర్స్ ని రప్పించాము.
ఇండియాలో ఈ స్పోర్ట్స్ ఉందా?
ఉంది. కానీ రావాల్సిన పాపుపరిటీ రాలేదు. ఇందులో రాజశేఖర్ గారి క్యారెక్టర్‌తో ఇదే అంశాన్ని ప్రెజెంట్ చేస్తున్నాం. ఇండియాలో శ్యామ్ కొఠారి అనే వెటరన్ రేసర్ ఉన్నారు. కానీ ఆయనకి క్రికెట్‌లో కపిల్ దేవ్‌కి వచ్చినంత గుర్తింపు రేసింగ్‌లో రాలేదు.ఈ రేసింగ్ స్పోర్ట్ మనకి ఎప్పటినుంచో ఉంది, కాకపోతే ఇందులో కొంచెం రిస్క్ ఎక్కువ. కపిల్ దేవ్‌కి ఉన్నంత గుర్తింపు శ్యామ్ కొఠారికి కూడా రావాలనేదే నా మోటివ్. ఇది ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ రేసింగ్ విషయంలో కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌ను ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నాం.











