హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి గుర్తుందా సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత సాయి రాజేశ్ మాట్లాడుతూ – బేబి మూవీ విజయం తర్వాత మేము డబ్బుల వెనక పరుగు పెట్టలేదు. ఒక మంచి కథతో మళ్లీ మూవీ చేయాలని అనుకున్నాం. నా మనసుకు నచ్చిన ఒక కథను రాసుకున్నాను. కథ రచయిత దగ్గర నుంచి దర్శకుడి దగ్గరకు వెళ్లి స్క్రీన్ మీదకు వచ్చేసరికి అందులోని ఒరిజినాలిటీ ఎంతో కొంత పోతుంది. కానీ ఈ సినిమాను నేను అనుకున్నదాని కంటే బాగా తెరకెక్కించాడు రవి నంబూరి. నేను బేబి మూవీని ఎంతో ప్రేమించి ఐదు గంటలు తీశాను. 3 గంటలకు ఎలా కుదించాలి అని ఆలోచిస్తున్న టైమ్ లో రవి వచ్చి హెల్ప్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ లోనూ నాతో ఉన్నాడు. కృతజ్ఞతగా రవిని ఈ సినిమా చేయమని రిక్వెస్ట్ చేశా. ఇప్పుడు కూడా ఒక గొప్ప సినిమా చేసి నాకే మంచి చేశాడు రవి. అతను ఎంత ప్రతిభావంతమైన దర్శకుడో తర్వాత మీరంతా చూస్తారు. ఈ సినిమా కొంత భాగం నేను చూశాను. సినిమా చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. రవి అంత బాగా తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హీరోకు సమానంగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర హీరోయిన్ ది. ఒక తమిళ సినిమా చూసి ఆమెను ఈ చిత్రానికి సెలెక్ట్ చేశాం. ఫస్ట్ ట్యూన్ నే అంత బాగా ఇచ్చేవారు. నేను ప్రొడ్యూసర్ గా ఆయనతో మూవీ చేయడం కంటే ఇంకే కోరుకోను అన్నారు.











