వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్ ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ లాంచ్ చేశారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ… నేను అశ్విని దత్ కలిసి ఫస్ట్ ప్రిన్స్ మహేష్ బాబుని పరిచయం చేశాం. దానికి సాయిబాబానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. తర్వాత పెళ్లి సందడి గంగోత్రి.. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశాం.ఆ విజయాల్లో భాగం సాయిబాబా కి ఈటీవీ కి ఉంది. తన అనుభవాన్ని అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అనే సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశారు. వర్ష చాలా మంచి ఆర్టిస్ట్. తను చాలా బిజీ కాబోతోంది. 30 ఏళ్ల క్రితం శాంతినివాసం సీరియల్ తో ఈటీవీతో మా జర్నీ మొదలైంది. శాంతి నివాసానికి రాజమౌళి డైరెక్టర్. నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా తీశాడు. ఈవిన్ కథా సుధాలో ఇప్పటివరకు ఒక పది కథలు తీశాను. వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. కానిస్టేబుల్ కనకం ప్రతి సీజను బాహుబలి లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.











