ఒక రోజు జరిగిన అనుకోని ఓ ఘటనతో 6 వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ స్టార్ హీరో శర్వానంద్ విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
టీజర్‌ను గమనిస్తే.. చుట్టూ పచ్చదనం, కొండలున్న అందమైన ఊరిని చూపిస్తారు. ‘చెప్పుకోడానికి ఇది మామూలు కథ కాదు. అండ పిండ బ్రహ్మాండాలను కూడా అల్లాడించే కథ’ అనే డైలాగ్ వినిపిస్తే , దానికి తగ్గట్లుగా ‘ఏం చెప్పాలనుకుంటున్నారో కాస్త క్లారిటీగా చెప్పవా’ అనే మరో డైలాగ్ వినిపిస్తుంది. ఈ గ్యాప్‌లో కొన్ని సీన్స్ కొంత మంది గన్స్‌తో కనిపిస్తారు. సినిమా ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన అక్షయ్ ఈవెంట్‌లో చెఫ్ లుక్‌లో కనిపిస్తాడు. అప్పుడే మనకు మరో మెయిన్ క్యారెక్టర్ విష్ణు ఎంట్రీ కనిపిస్తుంది. విష్ణు దగ్గరకెళ్లి ఈవెనింగ్ మంచి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశా మామ అని అంటాడు. టీజర్ చూస్తుంటే…డిఫరెంట్ కామెడీ, బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో ‘బా బా బ్లాక్ షీప్’ చిత్రాన్ని రూపొందించారని టీజర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. మూవీ ఓ బాక్స్, గన్ చుట్టూ తిరిగుతుందని అర్థమవుతుంది. ఇంతకీ ఆ గన్ కోసం మాఫియా డాన్ ఎందుకు వెతుకుతుంటాడు. చివరకు ఆ బాక్స్ ఎవరి దగ్గర ఉంటుంది.











