డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చాయ్ బిస్కెట్ ఇటీవలే లాంచ్ చేసిన షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ సూపర్ సక్సెస్ సాధించింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘చాయ్ షాట్స్’ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ కొత్త సీరియల్స్‌తో పాటు తెలుగు ఐకానిక్ సీరియల్స్‌ను కూడా చాయ్ షాట్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ విశేషాలను వెల్లడిస్తూ ‘చాయ్ షాట్స్ కిట్టీ పార్టీ’ ప్రెస్ మీట్ నిర్వహించారు. చాయ్ షాట్స్ కో-ఫౌండర్ శరత్ చంద్ర మాట్లాడుతూ…డిసెంబర్‌లో చాయ్ షాట్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాం. అప్పటికి యాప్‌ను ఎలా డిజైన్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలని ఆలోచనల్లో ఉన్నాం. ఇప్పుడు మూడు నెలలు గడిచాయి. ఈ సమయంలో మేము గుర్తించిన విషయం ఏమిటంటే..మా ఆడియన్స్‌లో దాదాపు 70% 35 ఏళ్లు పైబడినవారు. చాయ్ బిస్కెట్ లో మేము యంగ్ ఆడియన్స్ కోసం కంటెంట్ చేయడం అలవాటు. చాయ్ షాట్స్ లో టీవీ సీరియల్స్ తరహా కంటెంట్ చేసినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే రమణి గారిని సంప్రదించి దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో ఎలా తీసుకెళ్లాలి అని చర్చించాం. ప్రస్తుతం టీవీకి పని చేస్తున్న యాక్టర్స్, డైరెక్టర్స్‌తో కలిసి దాదాపు డజన్ షార్ట్ సీరియల్స్ రూపొందించాం. ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అవుతుంది. ఇప్పుడు ‘టీవీ ఎవరు చూస్తున్నారు?’ అనే అభిప్రాయం ఉంది. కానీ టీవీలో ఉన్న భావోద్వేగాలు, డ్రామా.. ఇవన్నీ యాప్‌లోకి తీసుకురావడం మా లక్ష్యం.”











