బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ సెట్ లో షూట్ ర్యాప్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. డెకాయిట్ ఒక కొత్త జోనర్ లో చేసిన సినిమా. ఈ మధ్యకాలంలో మనం లవ్ స్టోరీస్ చెప్పడం మానేశాను. ఈరోజుల్లో అందరూ ఒక మంచి లవ్ స్టోరీ కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో లవ్ స్టోరీనే యూనిక్. ఇది థ్రిల్లింగ్ యాక్షన్ లో చెప్పిన లవ్ స్టోరీ. ఒక కొత్త జోనర్లో చేసిన ప్రయోగం. కథలో అవసరం ఉందంటే నేను ఏదైనా చేస్తాను. ఇందులో రుబారూ కూడా కథలో ఆ క్యారెక్టర్ కి అవసరమైన సాంగ్. ఈ సినిమా అందరినీ ఎక్సయిట్ చేస్తుంది. సినిమా చివరకు వచ్చేసరికి అందరూ ఎమోషన్ అవుతారు. ఈ సినిమాలో ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా మీరు ఫ్యామిలీస్ తో కలిసి చూడొచ్చు. నేను మా సిస్టర్ తో కలిసి చూస్తాను. యాక్షన్స్ తో బ్లెండ్ చేసిన లవ్ స్టోరీ ఇది. ఇద్దరూ విడిపోయిన మాజీ ప్రేమికులు, వాళ్ళ జర్నీలో ఏం రియలైజ్ అవుతారో ఇందులో చాలా స్పెషల్ గా ఉంటుంది. చుట్టూ గన్స్ బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందని ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. నేటి (మార్చి 11)తో కలిపి 149 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాం. కథ ఏడాదిపాటు రాశాం. నేను, షానీ అనుకున్న పేరు అది. ఈ కథలో రాబరీ ఓ భాగం. అందుకే ఆ పేరు పెట్టాం. నాగచైతన్య పెళ్లి వేడుకలో అనురాగ్ గారికి ఈ కథ చెప్పా. వెంటనే ఆయన యాక్ట్ చేసేందుకు ఓకే అన్నారు. ఇందులో కన్నె పిట్టరో సాంగ్ పెట్టేలానే ఐడియా సుప్రియ గారిది. అది అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో షూట్ చేశాం. హిందీలో కొన్ని సీన్స్ ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్ గా వుంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ ని మ్యాసీవ్ అవుట్ డోర్ యూనిట్లో షూట్ చేసాము.











