“రాము ప్రొడక్షన్స్” బ్యానర్‌పై రూపొందుతున్న “ఏంటో అంతా సరికొత్తగా” చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సైలేష్ కొలను చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సైలేష్ కొలను మాట్లాడుతూ…“పోస్టర్ చూడగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. టైటిల్ కూడా చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కంటెంట్, కొత్త కథలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా అదే దిశలో మంచి ప్రయత్నంగా కనిపిస్తోంది. టీమ్ అంతా కొత్త ఎనర్జీతో పనిచేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
రాజ్ బోను గారు కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన కథ చెప్పే విధానం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నమ్ముతున్నాను. రాము గారు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడం అభినందనీయం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను,” అని తెలిపారు. ఈ చిత్రానికి రాజ్ బోను కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహిస్తున్నారు. రాము.ఎం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతం రిషి.ఎం, సినిమాటోగ్రఫీ వేణు కొత్తకోట, ఎడిటింగ్ హరీష్ జె.ఆర్ కృష్ణ అందిస్తున్నారు.











