విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎం.ఎం. నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, జె.వి.డి. ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్. హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ చిత్ర బృందం నేడు తిరుపతిలోని శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా… హీరో అమర్‌దీప్ మాట్లాడుతూ… శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న పాజిటివ్ వైబ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్ ‘రామ’ అనే పేరుతోనే మొదలైంది. ఇప్పుడు అదే పేరున్న కాలేజీలో మా ‘సుమతి శతకం’ ట్రైలర్ లాంచ్ అవ్వడం ఒక మంచి సెంటిమెంట్‌గా భావిస్తున్నాను. నేను కూడా మీలాగే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్‌ని, మీ ఎనర్జీ చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. అనంతపురంలో ఒక సామాన్య స్థాయి నుంచి వచ్చిన నాకు మీరు ఎంతో ప్రేమను అందించారు. ఈ సినిమా కోసం నా ప్రాణం పెట్టి పనిచేశాను. షూటింగ్ సమయంలో గాయాలైనా వెనకాడకుండా కష్టపడ్డాను. ఇందులో మంచి కామెడీతో పాటు డివైన్ ఎలిమెంట్స్, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వండి, నేనేంటో ఈ సినిమాతో నిరూపించుకుంటాను. మా సినిమా కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. ఫిబ్రవరి 6న విడుదలవుతున్న ‘సుమతి శతకం’ను థియేటర్లలో చూసి మమ్మల్ని ఆశీర్వదించండి” అంటూ ముగించారు.











