ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. తాజాగా ఈ చిత్ర యూనిట్ అధికారిక ప్రోమో విడుదల చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన తెలుగు ప్రోమో.. సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. డిఫరెంట్ స్టైల్ మేకింగ్ తో విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా వేదికలో ఈ వీడియో వైరల్ అయింది. జయవర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోంది. ఈ చిత్రానికి మారియా ఎలాంచెజియన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కనిపించే ప్రతి ఫ్రేమ్ కూడా వైవిధ్యంతో కూడి ఉండి ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు.











