ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్నశ్రీ వేణున్ దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న సినిమా “హలో ఇట్స్ మీ”. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నారు. షగ్నశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శన్ మదమంచి మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ 2 ఎస్ సినిమాస్, శ్సాస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వీఎస్ కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – నా రీసెంట్ ప్రాజెక్ట్ నయనం అందరి ఆదరణ పొందుతోంది. ఇటీవల వరుసగా థ్రిల్లర్స్ చేస్తూ వస్తున్నాను. అలాంటి టైమ్ లో హలో ఇట్స్ మీతో ఒక మంచి ఫ్యామిలీ, లవ్ మూవీ చేస్తున్నాను. ఇది క్లీన్ ఫ్యామిలీ మూవీ. యువతీ యువకులు ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది షగ్న బ్యూటిఫుల్ గా ఈమూవీలో చూపించింది. ఆమె స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో చెప్పింది. అప్పుడే డైరెక్టర్ గా ఆమెను నమ్మాను. షగ్న తప్పకుండా మంచి సినిమా చేస్తుందని బిలీవ్ చేశాను. నా రీసెంట్ ప్రాజెక్ట్ నయనం కూడా లేడీ డైరెక్టర్ స్వాతి చేశారు. నాకు హిట్ ఇచ్చారు. షగ్న కూడా ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నాను. వంశీకాంత్ అంతమంచి ఆడియో ఇచ్చారు. మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు ఉండాలి అన్నారు.











