ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ శుక్రవారం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకపోతుంది ఆ విశేషాలివి.
‘హే బల్‌వంత్‌లో సుదర్శన్ 2.0 అంటున్నారు?
సినిమాలో అంత మంచి క్యారెక్టర్ చేశాను. సినిమాకు చాలా క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. నేను పోషించిన బంక పాత్రను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉందని మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది.
సినిమాల్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది?
అమెరికాకు దారేది అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. దానికి అనుకోకుండా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌తో రన్‌రాజా రన్ ఆఫర్ వచ్చింది. ఆ తరువాత దోచెయ్, కుమారి 21ఎఫ్, పటాస్, సమాజవరగమన, నారీ నారీ నారి నడుమ మురారి, ఇప్పుడు హే బల్‌వంత్ సినిమాలు నన్ను ప్రేక్షకులకు చేరువ చేశాయి.
గత సినిమాలతో పోలీస్తే ఈసినిమాలో ఎక్కువగా మీ పంచ్‌లు బాగా పేలినట్టున్నాయి?
ఈ చిత్రంలో నా పాత్రకు ఇంపార్టెన్స్ వల్ల పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. డ్రింకింగ్ సీన్, వెన్నెల కిపోర్‌తో చేసిన ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌కు థియేటర్స్‌కు ఊగిపోతున్నాయి. నా ప్రతి పంచ్‌తో పాటు సినిమాలో వెన్నెల కిషోర్, సుహాస్, నరేష్, సుహానీ అందరూ హిలేరియస్‌గా నవ్వించారు.
ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇంతగా ఆకట్టుకోవడానికి రీజన్ ఏమిటని అనుకుంటున్నారు?
ఈ సినిమాలో నటించిన అందరితో నాకు అందరితో మంచి ర్యాపో ఉంది. ప్రతి సీన్‌కు అందరం మంచి సింక్‌లో ఉన్నాం. అందరూ క్లోజ్‌నెస్‌తో ఫ్లోతో సీన్‌లు బాగా వచ్చాయి
మీకు హీరోగా ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది?
నేను హీరోగా వెండితెరపై ఇప్పుడే చేయను. అనుకోకుండా సినీ పరిశ్రమకు వచ్చాం. కమెడియన్‌గా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను. ఈ టైమ్‌లో రిస్క్ తీసుకోలేను. కమెడియన్‌గా నాకు అందరి హీరోలతో కలిసి సినిమాలు చేయాలని వుంది. నటుడిగా సెటిల్ అయిపోయిన తరువాత హీరోగా ఆలోచిద్దాం. ఒకవేళ హీరోగా చేస్తే చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో చేసే ఓటీటీ సినిమాలు చేస్తాను.










