హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్ తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు , శౌర్యను మునుపెన్నడూ ఇంటెన్స్ గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. నరేష్ వీకే పాత్ర దేవుడిని ప్రార్థిస్తూ.. ప్రమాదకరమైన వ్యక్తుల అణచివేతలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఆ సమయంలో ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ అనే రగ్గ్డ్, తన రూల్స్ తో జీవించే పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఎంట్రీ అదిరిపోతుంది. విలన్‌పై అతను ఎలా పోరాడుతాడు, అమాయకులని ఎలా కాపాడుతాడు అన్నదే కథలో ప్రధానాంశం. హీరో నాగశౌర్య మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా జరగాలని ఎంతో పట్టుదలతో ముందుకు తీసుకొచ్చారు. ఆయనకి హ్యాట్సాఫ్. ఆయన అనుకున్నదంతా జరగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్, పేరు రావాలని కోరుకుంటున్నాను.ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లలో చూసి ఆశీర్వదించాలి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. “ఆరెంజ్” సినిమా పాటలు విన్నప్పటి నుంచి హారిస్ జయరాజ్ గారితో వర్క్ చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే రసూల్ గారితో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అనుకునేవాడిని. ఆయన కెమెరాలో నేను ఎలా కనిపిస్తానో చూడాలని ఉండేది. ఈ సినిమా ద్వారా అది సాధ్యమైంది. నన్ను చాలా బాగా చూపించారు. ప్రభాస్ గారి “ఈశ్వర్” సినిమాలో శ్రీదేవి గారిని చూసాను.











