తరుణ్‌భాస్కర్ హీరోగా ‘గాయపడ్డ సింహం’ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ను సృష్టిస్తోంది. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్. ప్రమోషన్స్‌లో భాగంగా జేడి చక్రవర్తి మాట్లాడుతూ.. యాక్టర్స్ అందరికీ కమల్ హాసన్ గారు ఒక కొలమానం. ఆయన చేసిన అన్ని క్యారెక్టర్లు వరల్డ్ సినిమా హిస్టరీలో ఎవ్వరూ చేయలేదు, చేయబోరు. అయితే “గాయపడ్డ సింహం”లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. “ధర్మ” క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. క్యారెక్టర్ పరంగా కమల్ హాసన్ గారు కూడా ఇలాంటి పాత్ర చేసి ఉండరు. అంత గొప్ప పాత్ర ఇందులో చేశాను. కెరీర్‌లో చాలామందికి జయాపజయాలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర ఒకటి ఉంటుంది. నాకు ‘మనీ’, సత్య, ‘అనగనగా ఒక రోజు’ చిత్రాలు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం దొరికింది. ఈ సినిమాను పవన్ తన భుజాన వేసుకుని మొదలుపెట్టాడు. తర్వాత అందరూ ఒక టీమ్‌గా కలిసి పని చేశారు. ఈ సినిమా దిల్ రాజు గారికి నచ్చడం అనేది పెద్ద కమర్షియల్ కొలబద్ద. కశ్యప్ ఖచ్చితంగా చాలా ఇన్నోవేటివ్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాలో చాలా కొత్త రకం కామెడీ ఉంటుంది. తరుణ్ భాస్కర్, నేను, భాను ఇలా చాలామంది డైరెక్టర్స్ కలిసి పనిచేసిన సినిమా ఇది. కశ్యప్ ఎంతో మంది డైరెక్టర్స్‌తో పనిచేస్తూ తనకు కావాల్సింది తీసుకున్నాడు. చాలా కొత్త రకం హ్యుమర్ వున్న సినిమా ఇది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.











