మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మాజీ, మైత్రి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ ఈవెంట్ లో… నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘రాకాస’ని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్‌కి పర్సనల్‌గా థాంక్స్ చెప్పాలని ఉంది. కానీ అది అసాధ్యం. మా డిస్ట్రిబ్యూటర్లందరూ హ్యాపీగా ఉన్నారంటే అది నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. మా మూవీని చూసి ఎంజాయ్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మీదున్న నమ్మకంతో ‘రాకాస’ని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. ‘ఉప్పెన’ టైంలో మైత్రి రవి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నాకు ఈ ఇండస్ట్రీలో పెద్ద గైడెన్స్ ఇస్తారు. స్ట్రైక్ టైంలో సపోర్ట్ చేసిన సుప్రియ అక్క, స్వప్న అక్కలకు థాంక్స్. సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీని ఎంతో ఆదరిస్తున్నారు. నా టీం సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఏ ఒక్కరూ కూడా ప్రమోషన్స్ విషయంలో కండీషన్స్ పెట్టలేదు. సంగీత్, నయన్, గెటప్ శ్రీను అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బిగ్గెస్ట్ పిల్లర్‌గా రమేష్ గారు మాకు అండగా నిలిచారు. మా మూవీకి మీడియా నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో నేటి నుంచి ‘రాకాస’ని కేవలం వంద రూపాయలకే అందిస్తున్నాం. అందరూ ‘రాకాస’ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.











