మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక నిర్మిస్తున్న సినిమా “స్కై”. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. “స్కై” సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ను ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – ఈ ఈవెంట్ కు వచ్చే ముందు “స్కై” సినిమా కంటెంట్, సాంగ్స్ చూశాను. ఆ కంటెంట్ చూస్తుంటే ఈ మూవీలో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చూడబోతున్నామని తెలుస్తోంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. రసూల్ ఎల్లోర్ విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమాకు పెట్టిన క్యాప్షన్ తోనే మూవీ ఎస్సెన్స్ తెలుస్తోంది. “స్కై” సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాఅన్నారు. ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గుంటక మాట్లాడుతూ – మా మూవీ ప్రెస్ మీట్ కు వచ్చిన మధుర శ్రీధర్ కి థ్యాంక్స్. “స్కై” సినిమాను మేమంతా ఎంతో కష్టపడి ప్రొడ్యూస్ చేశాం. టీమ్ అందరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్న ఒక కొత్త ప్రేమ కథను మా మూవీలో మీరంతా చూడబోతున్నారు. ఫిబ్రవరి 6న సినిమాను రిలీజ్ చేస్తున్నాం అన్నారు.











