హైదరాబాద్ ఐటిసి కాకతీయలో జరిగిన ఫంక్షన్ లో శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి కింగ్ బుద్ధ వుయ్ వాంట్ వరల్డ్ పీస్ అనే టైటిల్ సాంగ్ ను అధికారికంగా లాంచ్ చేశారు. ఇరాన్ – ఇజ్రాయిల్, ఉక్రెయిన్ – రష్యాతో పాటు 50 దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని “కింగ్ బుద్ధ వుయ్ వాంట్ వరల్డ్ పీస్” సత్యారెడ్డి చేస్తున్న గొప్ప ప్రయత్నాన్ని ఆయన కొనియాడారు. ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రారంభించి థాయిలాండ్, మలేషియా, వియత్నం, కాంబోడియా, లావోస్, ఇండోనేషియా లాంటి బుద్దిస్ట్ దేశాల్లో షూటింగ్ జరుపుకోవడం హర్షనీయమని ఆయన అన్నారు. త్వరలో తమ శ్రీలంక దేశంలో షూటింగ్ జరుపుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఇన్ని బౌద్ధ దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఏకైక చిత్రంగా కింగ్ బుద్ధ నిలిచిపోతుందని ఆయన అన్నారు. అన్ని బౌద్ధ దేశాల సహాయ సహకారాలు ఈ చిత్రానికి అందిస్తారని ఆయన ఆశించారు.











