ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (M4M – Motive for Murder)’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, ఎంసి విన్ గ్రూప్ యుఎస్‌ఎ సహకారంతో రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనార్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. అమెరికాలో విడుదల బాధ్యతలను టెక్‌ఫ్లిక్స్ ఉత్తర భారత విడుదలను .జెవెల్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో “M4M” చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది.











