-క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్
“కుమారి 21ఎఫ్, ఈడో రకం – ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్” వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్ లో ఎన్నో ఉన్నప్పటికీ… తాజాగా నేను చేస్తున్న “మిరాకిల్” నా కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ మూవీ అవుతుంది. థాంక్స్ టు డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల” అని అన్నారు క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్. సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం “మిరాకిల్”లో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది.. సీనియర్ హీరోలు సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ బీసు హీరో. “సత్య గ్యాంగ్, ఫైటర్ శివ” చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన “కొండమడుగు”లో పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు, యూనిట్ సభ్యులందరి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించింది “మిరాకిల్” చిత్రబృందం. తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా “మిరాకిల్” నిలిచిపోతుందని ప్రకటించడం ద్వారా ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది హీరోయిన్ హెబ్బా పటేల్.











