హార్డ్ హిట్టింగ్ సినిమాలు అందించడంలో పాపులరైన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం’ శ్రీనివాస మంగాపురం’ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. వైరల్ అయిన ఉయ్ అమ్మ ట్రాక్‌తో దేశవ్యాప్తంగా అలరించిన తర్వాత రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిర్మాత పి కిరణ్ నిర్మిస్తున్న శ్రీనివాస మంగాపురం ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో స్ట్రాంగ్ బజ్‌ను సృష్టించింది. మేకర్స్ ఈ చిత్రంలో మరో ప్రముఖ పాత్రను పరిచయం చేశారు. వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు ఫెరోషస్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. పోస్టర్‌లో ఆయన ఇంటెన్స్ గా నడుస్తూ, రా అథారిటీని ప్రజెంట్ చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ జుట్టు, మీసం ఆయన ఫియర్స్ వ్యక్తిత్వాన్ని మరింత హైలైట్ చేస్తుంటే, తెల్లటి కుర్తా–ధోతి ఆయనను శక్తివంతమైన గ్రామ పెద్దగా చూపిస్తోంది. మెడలో బంగారు గొలుసులు, చేతికి వాచ్, బ్రేస్లెట్ వింటేజ్ మాస్ టచ్‌ను అందిస్తున్నాయి. ఆయన వెనుక తుపాకులతో నిలిచిన మనుషుల సమూహం చూస్తుంటే గౌరవంతో పాటు భయాన్ని కూడా కలిగించే వ్యక్తి అర్ధమౌతుంది. మొత్తంగా ఈ పోస్టర్ తన నేలను గొప్ప సంకల్పంతో పాలించే వ్యక్తి స్వభావాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. మోహన్ బాబు ఇప్పటికే టీమ్‌లో చేరగా, సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది.











