జి.ఎస్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ… ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి.శైలజా రెడ్డి నిర్మిస్తున్న ముక్కోణపు ప్రేమకథాచిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ వినూత్న ప్రేమ కథాచిత్రం షూటింగ్ కి ముందే పాటల రికార్డింగ్ పూర్తి చేసుకుని సంగీత సౌరభాలు వెదజల్లుతోంది. పవన్ మహావీర్ సరసన సుహాన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని మరో హీరోయిన్ ను త్వరలో రివీల్ చేస్తారు. ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ స్వర సారధ్యంలో… దర్శకుడు శివాల ప్రభాకర్ సమకూర్చిన సాహిత్యానికి సుప్రసిద్ధ గాయనీగాయకులు చిత్ర, హరిణి, బృంద, అరుణ్, సాయి చరణ్, కృష్ణ తేజస్వి గాత్రమందించారు. హైదరాబాద్, సారధి స్టూడియోలో అత్యంత ఘనంగా అతిరథమహారధుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఈనెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. రాజమండ్రి సమీపంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పట్టిసీమలో ప్రారంభమయ్యే ఈ షూటింగ్ తదుపరి వైజాగ్, అరకు ప్రాంతాలకు షిఫ్ట్ కానుంది.











