సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ హీరోయిన్ గా నటించగా, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. పి.ఒ.వి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా అందరి ఆదరణ అందుకుంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, గీత రచయిత చంద్రబోస్ వీడియో బైట్ ద్వారా స్పందిస్తూ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని చెబుతూ టీమ్‌ను అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో ‘నిలవే’ సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నం తోపాటు టీమ్ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నా”అని అన్నారు.











