మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “పళ్లిచట్టంబి”. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. “పళ్లి చట్టంబి” సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో టొవినో థామస్ మాట్లాడుతూ – నేను డైరెక్టర్ డిజో ఈ ప్రాజెక్ట్ చేయాలని గత కొన్నేళ్లుగా అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. 50వ దశకం నేపథ్యంగా సాగే చిత్రమిది. అప్పటి వాతావరణం కనిపించేలా సినిమాను రూపొందించేందుకు చాలా రీసెర్చ్ చేశాం. 50వ దశకం సినిమా 2026లో ప్రేక్షకులకు నచ్చేలా చేశాం. ఎంతో ప్యాషనేట్ టీమ్ తోడు లేకుంటే ఇలాంటి మూవీ తెరకెక్కించడం సాధ్యం కాదు. డిజో, నేను ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చేయాలని కూడా డిస్కషన్స్ చేసుకున్నాం. ఈ మూవీ షూటింగ్ టైమ్ కు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు డిజో. ప్రొడ్యూసర్ చరణ్, చైతన్య, చాణక్య ఒక టీమ్ లా వర్క్ చేసుకుంటూ తమ కలల్ని నిజం చేసుకుంటున్నారు. నౌఫల్, బ్రిజీష్ లాంటి మంచి ప్రొడ్యూసర్స్ లేకుంటే పళ్లిచట్టంబి లాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. వాళ్లిద్దరు మూవీకి బ్యాక్ బోన్ లా ఉన్నారు. ఒక ముఖ్య పాత్రలో నటించిన శత్రు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. కయదు ఈ సినిమాలో నటించేటప్పుడు చాలా ప్రిపేర్ అయ్యేది. అప్పుడే నటన పట్ల ఆమెకున్న ప్యాషన్ చూశాను. ఒకేసారి అనేక భాషల్లో నటించడం ఈజీ కాదు. కయదు ఇతర భాషల ఆడియెన్స్ ను కూడా మెప్పిస్తోంది. అలాంటి మంచి కోస్టార్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి పళ్లిచట్టంబి మనందరి మూవీ కాబోతోంది అన్నారు.











